HINDI:

భగవద్గీత శ్రీమద్ భగవద్గీత లోని శ్లోకాలను పఠించి మననం చేసుకునేందుకు ఈ పాఠ్యాంశం ఉపయోగపడుతుంది. సంస్కృత విధ్వాసులచే దోషరహిత ఉచ్చారణతో తయారు చేయబడి సాధనకు అనుకూలంగా శ్లకలను సిద్ధం చేయడమైనది. సాధకులు తమ సమయానుకూలంగా భగవద్గీత పుస్తకం అనుసరిస్తూ శ్లోకాలను అభ్యసించవచ్చు. ఈ పాఠంలో రెండు దశలు కలవు. మొదటిది అభ్యాసదశ రెండవది పారాయణదశ. భగవద్గీత లోని సమస్త శ్లోకాలు అధ్యాయాల వారిగా ఒక పట్టికలో పొందుపరచడమైనది. సాధకులు ఒక్కొక్క అధ్యాయం అభ్యసించి పారాయణ చేయవచ్చు. లేదా అన్ని అధ్యాయాలను మొదట అభ్యసించి తదుపరి పారాయణ చేయగలరు.